పలాస జడ్పీటీసీ దువ్వాడ సంతోష్ రామ్ నాయుడుకు గౌతు శివాజీ దంపతుల ఆశీస్సులు
LIVE9 NEWS – PALASA
తేదీ: 10 నవంబర్ 2026
మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉత్తరాంధ్ర లెజెండరీ నాయకులు శ్రీ గౌతు శ్యామసుందర శివాజీ గారు, వారి సతీమణి ని పలాస జడ్పీటీసీ దువ్వాడ సంతోష్ రామ్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి వారిరువురి ఆశీస్సులను తీసుకున్నారు.
పలాస జడ్పీటీసీగా మంచి మెజారిటీతో విజయం సాధించిన అనంతరం, పెద్దలను కలిసి వారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో దువ్వాడ శ్రీహర్ష, సిస్టు మురళీకృష్ణ, బూర్ల కృష్ణంరాజు, సాసుమన రామారావు, బమ్మిడి కిరణ్, మౌళి, ఇచ్చాపురం సీతారాం, హేమసుందర్, బూర్ల ఢిల్లీ, బూర్ల తులసితో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
