జిల్లా వార్తలు

ఏయూ క్యాంప‌స్‌లో అధునాత‌న వీధి దీపాలు ప్రారంభం

క్యాంప‌స్‌లో మ‌రింత వెలుగులు

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం, LIVE9 NEWS ,న‌వంబ‌ర్ 10:

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణంలో ప‌లు ప్రాంతాల‌లో మ‌రింత వెలుగులు నింపే విధంగా అధునాత విద్యుత్ దీపాల‌ను ఏర్పాటు చేసారు. వీటిని ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ మంగ‌ళ‌వారం ఏయూ రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్‌, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబుల‌తో క‌లిసి ప్రారంభించారు. వీటి స‌హాయంతో విద్యార్థులు విభాగాల‌ను సుర‌క్షితంగా చేరుకోవ‌డం, విభాగాల నుంచి హాస్ట‌ల్స్‌కు వెళ్ల‌డానికి రాత్రివేళ‌లో ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. అదే విధంగా అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డే వ్య‌క్తుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి, బ‌య‌టి వ్య‌క్తుల‌ను నిలువ‌రించ‌డానికి సెక్యూరిటీ సిబ్బందికి ఈ విద్యుత్ ఆధునీక‌ర‌ణ ఎంతో ఉప‌క‌రిస్తుంది. ప్ర‌ధాన‌మైన ప్రాంతాల‌లో ఫ్ల‌డ్‌లైట్ల‌తో పాటు, మ‌ద్దిల‌పాలెం కూడ‌లి నుంచి మూడో ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చే మార్గంలో ప‌లు చోట్ల నూత‌న విద్యుత్ దీప స్థంభాలు, ఎక్కువ వెలులుగు ప్ర‌ప‌రించే విద్యుత్ దీపాల‌ను ఏర్పాటు చేశారు.
విద్యార్థుల బ‌ధ్ర‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తూ, క్యాంప‌స్‌ను మ‌రింత సుర‌క్షితంగా నిల‌ప‌డానికి ఇవి ఎంత‌గానో ఉప‌యుక్తంగా నిలుస్తాయ‌ని అధికారులు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఏయూ డీన్‌లు ఆచార్య కె.శ్రీ‌నివాస రావు, అసోసియేట్ డీన్ ఆచార్య ఎం.గోపీచంద్ నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *