చెవిలో ఇయర్‌ఫోన్స్.. పట్టాలపై మృత్యువు!
ఒక్క క్షణం అజాగ్రత్త.. 21 ఏళ్ల యువకుడి ప్రాణం బలి!
Vijayanagaram …Live9 News 10th Nov 2026
విజయనగరం జిల్లా గజపతినగరంలో విషాదం చోటుచేసుకుంది. పురిటిపెంట గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్ (21) రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతుండగా రైళ్లు వస్తున్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఒక ట్రాక్‌పై వస్తున్న రైలును తప్పించుకునే క్రమంలో మరో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న పవన్.. దీపావళి పండుగకు స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
యువతకు ఒక విజ్ఞప్తి.. రైల్వే ట్రాక్ దాటేటప్పుడు ఇయర్‌ఫోన్స్, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండండి. రైలు పట్టాలు నడిచే దారులు కావు. చిన్న అజాగ్రత్త జీవితాన్నే బలితీసుకోవచ్చు.
పాట వినడం కంటే ప్రాణం ముఖ్యం.. క్షణిక నిర్లక్ష్యం వద్దు.
