ఆంధ్రప్రదేశ్

విశాఖలో మూడు రోజుల పాటు డ్రోన్ కెమెరాలపై నిషేధం

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ పరిసరాల్లో 3 కిలోమీటర్ల మేర రెడ్ జోన్

విశాఖపట్నం, నవంబర్ 10:

విశాఖపట్నం నగరంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న CII Partnership Summit నేపథ్యంలో నగర పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం విధించారు.

నవంబర్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 72 గంటల పాటు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కేంద్రంగా మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించారు.

ఈ పరిధిలో ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రోన్ కెమెరాలను వినియోగించరాదని నగర పోలీసులు స్పష్టం చేశారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి డ్రోన్లను వినియోగించిన వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నగరంలో డ్రోన్ కెమెరాలు కలిగి ఉన్న వ్యక్తులు, సంస్థలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విశాఖపట్నం సిటీ పోలీసులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *