డ్రైనేజీలో గోనెసంచిలో అప్పుడే పుట్టిన పసికందు..
LIVE9 NEWS – విశాఖపట్నం 10th Nov 2026

విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ పసికందును గుర్తుతెలియని వ్యక్తులు గోనెసంచిలో ఉంచి డ్రైనేజీలో పడేశారు.
డ్రైనేజీ నుంచి పసికందు ఏడుపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకుని చిన్నారిని గుర్తించారు. వెంటనే శిశువును బయటకు తీసి కాపాడారు.
ఈ ఘటనపై స్థానికులు వెంటనే ఎంవీపీ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై సీతారాం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ప్రస్తుతం పసికందు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును డ్రైనేజీలో పడేసిన ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శిశువును వదిలివెళ్లిన వ్యక్తులు ఎవరు? ఏ కారణంతో ఈ దారుణానికి పాల్పడ్డారు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
LIVE9 NEWS – మన సమాజం.. మన బాధ్యత..
