జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు !!
Live9 News , Amaravavathi 10th Nov 2026

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ ఎమ్.వి.ఆర్. కె. తేజ ఐఏఎస్ గారికి కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ – గ్రామ స్వరాజ్ యోజన (PM-VGSY) మార్గదర్శకాల రూపకల్పన కమిటీలో రాష్ట్రాల తరఫున నామినేట్ చేసిన 10 మంది ప్రతినిధుల్లో కృష్ణతేజ గారికి చోటు దక్కింది.
2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్ల పాటు అమలు కానున్న ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ₹7,395.55 కోట్ల నిధులను ఆమోదించింది.
ఈ పథకం విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం ద్వారా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లభించనుంది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు ఇది ఒక ముఖ్యమైన గుర్తింపు.
