మంత్రి నారా లోకేశ్‌తో ఐసీజీ జిల్లా కమాండర్ భేటీ
అమరావతి/ విశాఖపట్నం, LIVE9 NEWS నవంబర్ 10 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు భారతీయ తీర రక్షక దళం (ఐసిజి) మధ్య సమన్వయం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మంగళవారం కీలక భేటీ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ జిల్లా ప్రధాన కార్యాలయం నం.6 జిల్లా కమాండర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సి.డి. మొహపాత్ర రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో తీరప్రాంత భద్రత అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. దాదాపు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో తీర భద్రత, సముద్ర రక్షణ ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఇరువురు అభిప్రాయపడ్డారు.
తీరప్రాంతంలో నిఘా, సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల రక్షణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల వేళ వేగంగా స్పందించడం, ప్రజల్లో, ముఖ్యంగా మత్స్యకారుల్లో భద్రతపై అవగాహన కల్పించడం వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ తన పూర్తి సహకారం, మద్దతు అందించేందుకు కట్టుబడి ఉందని డీఐజీ మొహపాత్ర మంత్రికి తెలియజేశారు.
అదేవిధంగా తీరప్రాంత అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ కోస్ట్ గార్డ్ భాగస్వామ్యం, యువతలో దేశభక్తి, సముద్ర భద్రతపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు, మత్స్యకార గ్రామాల్లో వైద్య శిబిరాలు, స్వచ్ఛ తీర కార్యక్రమాల వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారు. తీరప్రాంత భద్రత కోసం, మత్స్యకారుల ప్రాణాల రక్షణ కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అందిస్తున్న సేవలు కొనియాడదగ్గవని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోస్ట్ గార్డ్‌కు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారులకు, సిబ్బందికి, మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం, కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం, విపత్తు నిర్వహణలో సమన్వయం వంటి అంశాల్లో ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పారు.
ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం మరియు భారతీయ తీర రక్షక దళం మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరియు సురక్షితమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం పట్ల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించిందని అధికారులు తెలిపారు. పూర్వ ముఖ్యంగా టెక్నాలజీ వినియోగం, కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం, విపత్తు నిర్వహణలో సమన్వయం వంటి అంశాల్లో ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పారు.
ఈ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం మరియు భారతీయ తీర రక్షక దళం మధ్య పరస్పర సహకారం, సమన్వయం మరియు సురక్షితమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం పట్ల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబించిందని అధికారులు తెలిపారు.
